Skip to main content

Posts

Showing posts with the label Bible Sermons

నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు

నన్ను ఎవరూ అర్ధం చేసుకోవడంలేదు GLP Rajesh Babu నన్ను ఎవరు అర్ధం చేసుకోవడం లేదు, నా మాటలు ఎవరు లెక్కచేయటంలేదు, అర్ధం చేసుకోవడానికి బదులు అపార్ధం చేసుకుంటున్నారు, దూరం పెడుతున్నారు, నన్ను ఎవరూ పట్టించుకోవడంలేదు అని దిగులుపడుతున్నారా? చెప్పుకోలేని చింతతో, వేదనతో, నిండిపోతూ ఉన్నారా? కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారి ఆదరణకు దూరమై నలిగిపోతు ఉన్నారా? అయితే ఇది మీ కోసమే.      ఈ విషయాలలో మనము ఇతరులెవరిని నిందించవలసిన అవసరం లేదు కానీ, మనమేమిటో మనలను మనం అర్ధం చేసుకోవలసిన వారమై యున్నాము. మనలను మనమే అర్ధం చేసుకోలేకపోతే ఇతరులు మనలను అర్ధం చేసుకునేట్లు వారితో మనము ఏలాగు మెలగగలము? మనము ఎవరి గురించి చింతించవలసిన అవసరం లేదు, మనలను అర్ధం చేసుకోవడం లేదని ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు.      సాధారణంగా మానవులందరు, సాటివారు తమను అర్ధం చేసుకోవాలని కోరుకుంటారు. భార్య తనని అర్ధం చేసుకోవాలి అని భర్త, భర్త తనని అర్ధం చేసుకోవాలని భార్య, తల్లితండ్రులు తమను అర్ధం చేసుకోవాలని పిల్లలు, పిల్లలు తమను అర్థం చేసుకోవాలని తల్లితండ్రులు ఇలా మంచి సత్సంబంధాలు కలి...