Skip to main content

నిర్గమకాండము 4:24


అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా  వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె సున్నతిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను. నిర్గమకాండము 4:24-26 .

     ఐగుప్తుకు వెళ్లే మార్గం మార్గములో, పంపించిన దేవుడే చంపడానికి సిద్ధపడినట్లు కనబడుతుంది. ఎందుకని? ఇది కొంచెం అర్ధం చేసుకోవానికి కష్టమైన వాక్యం. అయినప్పటికీ వాక్యమును కాస్త  మనసు పెట్టి ఆలోచించగలిగితే వాస్తవాలు అర్ధం కాగలవు. దేవునికి మోషేకు మధ్య విస్తారమైన సంభాషణ జరిగినట్లు, అనేక సూచనలతో దేవుడు ఇజ్రాయెలీయులను విడిపించడానికి మోషేను ఐగుప్తుకు పంపిస్తున్నాడు అని ముందు అధ్యాయాల నుండి మనం గ్రహించవచ్చు. మోషేని మాత్రమే ఎన్నుకున్నానని చెప్పిన దేవుడే చంపడానికి నిలువబడ్డాడు మార్గమధ్యలో. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుదాం.

1. మోషే మీద జరిగిన మరణ ప్రయత్నం ఎటువంటిది?
     ఒక వ్యక్తిని దేవుడు చంపాలి అనుకుంటే దానికి చాల కారణాలు, విధానాలు ఉండొచ్చు. వివిధ రకముల కారణాలతో, వివిధ రకాల విధానంలో అనేకమంది దేవుని మరణ శిక్షకు బలైపోయినట్లు లేఖనాలలో మనం చూడచూడగలము. ఉదాహరణకు సంఖ్యకాండము 16:32, 15:32-36, అపో 5:5-10. కానీ ఇక్కడ కారణం ఆలోచించే ముందు విధానం చూద్దాం. సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసేంత సమయం మనకు కనపడుతుంది కనుక దేవుడు ఎదో ఒక మరణకరమైన వ్యాథితో మోషేని మొత్తి  ఉండొచ్చు, అనేది ఎక్కువమంది పండితుల అభిప్రాయం.

2. ఎందుకు చంపాలనుకున్నాడు?
     అక్కడ మోషే భార్య అయినా సిప్పోర చేసిన పనిని బట్టి , అది వరకు మోషే తన కుమారులకు సున్నతి చేయలేదని అర్ధం అవుతుంది. మోషే ఒక ఇజ్రాయెలీయుడిగా తన పిల్లలకు సున్నతిని చేయవలసినవాడైయున్నాడు. కానీ చేయలేదు. ప్రతి ఇజ్రాయెలీయుడు (పురుషులు) తప్పక సున్నతి పొందాలి అనేది దేవుడు నియమము అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన, అబ్రాహాము తరములన్నిటికి తప్పక పాటించవలసిన కట్టడ. (ఆదికాండము 17:9-14 చదవగలరు).   కనుక సున్నతి తప్పనిసరి అయియున్నది.  లేని యెడల అతడు దేవుని నిబంధనను మీరిన వానిగా పరిగణించబడతాడు. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు సున్నతి ఒక సంకేతం. 

3. మోషే మరియు సిప్పోరాల నిర్లక్ష్యం:
     మోషే దేవుని సేవకుడు, దేవుని పక్షముగా ఇతరులని నడిపించే ప్రవక్తగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకందరికి దేవుని చిత్తాన్నీ  ప్రకటించవలసిన వాడై యున్నాడు. అప్పుడు అందరికంటే ఎక్కువగా, ముందుగా, దేవుని మాటలకూ, నిబంధనకు, చిత్తానికి విధేయుడు కావలసిన వాడైయున్నాడు. కానీ మోషేలో అవిధేయత కనపడుతుంది, తన పిల్లల సున్నతి విషయంలో దేవుని నిబంధనను మర్చిపోయిన వాడుగా ఉండగా, దేవుడు అతని అవిధేయత కనపడేట్లు వ్యతిరేకిగా మారాడు. చంపడానికి చెయ్యి ఎత్తాడు. అప్పుడు సిప్పోరా చేసిన పనిని మనము వాక్యంలో చదవగలము. నిజానికి మనకు అందరికి తెలుసు మోషే ఐగుప్తు నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు, అక్కడ అబ్రాహాము సంతతి అయిన మిద్యానీయులు ( కెతూరా కుమారుని సంతతి) నివాసం ఉంటున్నారు, వారి మధ్యలో మోషే కాపురమున్నాడు. మిద్యానీయులు విగ్రహారాదికులు కారు కానీ ఒకే దేవునిని ఆరాధిస్తారు. మోషే అక్కడ మిద్యాను యాజకునితో ఉంటూ అతని ఏడుగురు కుమార్తెలలో ఒకతెను అనగా సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ తమ కుమారుని సున్నతి విషయంలో నిర్లక్ష్యం వహించారు, కనుక దేవుడు శిక్షించడానికి నిలువబడ్డాడు.

     ఆదికాండము 15:6, కీర్తనలు 106:31, రోమా 4:3, గలతి 3:6 ప్రకారం అబ్రాహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇస్సాకు, యాకోబు, ఇలా అబ్రాహాము సంతానం అంతా నిబంధన, గైకొనినవారే. వీరందరికి సున్నతినిబట్టే ఇశ్రాయేలీయుడు అని గుర్తించబడతారు. సున్నతి ద్వారా వారి విధేయత, విశ్వాసం కనుపరచబడుతుంది. కానీ సున్నతి విషయంలో సిప్పోరా మోషేతో సహకరించలేదు, మోషే కూడా అంతగా పట్టించుకోనట్లు కుమారుని విషయంలో జరిగిన ఆలస్యాన్ని బట్టి మనం గ్రహించాలి. సున్నతి యొక్క ప్రాముఖ్యత మోషే సిప్పోరాకి చెప్పలేదు, సిప్పోరాకి దానిని గూర్చి అంత అవగాహన లేదు. విషయంలో భార్యభర్తలిద్దరూ నిర్లక్ష్యంగా  ఉన్నారు. సిప్పోరా దైవ వ్యతిరేకి కాదు కానీ, మిద్యాను సంప్రదాయాలలో ఉంది. అందుకే సున్నతి విలువ గ్రహించలేకపోయింది. మోషే కూడా దాని గురించి అంతగా పట్టించుకోలేదు కనుక దేవుడు చెయ్యి ఎత్తేవరకు నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుడు విషయాన్ని చూచి చూడనట్లు వదిలేస్తాడులే అని అనుకుని ఉండొచ్చు. కనుక ప్రాముఖ్యమైన విషయంలో వారిని మేల్కొలపడానికి దేవుడు మోషేని చంపడానికి ప్రయత్నిమ్చాడు, వారికీ కన్నులు తెరచుని సున్నతి ప్రాముఖ్యత గ్రహించి తన కుమారునికి పని చేసినప్పుడు , నిజమైన రక్తసంబంధం మరియు పరిపూర్ణ ఇశ్రాయేలు పౌరసత్వం మోషే కుటుంబానికి లభించింది.      

ముగింపు:
     ఈరోజు చాలమంది ఇతరులలు బోధిస్తారు, కానీ తమకు తమ కుటుంబాలకు బోధించుకోరు, దేవుడు చెప్పిన అనేక వాక్యవిషయాలు పాటించరు. మనం ఇతరులకి చెప్పేది ముందు మనం చేసి అప్పుడు చెప్పాలి. విశ్వాసం, విధేయతలు చేసి చూపేవే కానీ, నోటి మాటలలో మాత్రమే చెప్పేవి కాదు. దేవుడు మన విశ్వాస విధేయతలు మన ఆచరణలో చూడటానికే ఇష్టపడతాడు కానీ, మాటలలో కాదు. మోషే విషయంలో కఠిన పరిస్థితిని తీసుకోవడానికి దేవుడు సిద్దమయ్యాడు, అప్పుడు సిప్పోరు తన కుమారునికి తానే సున్నతి చేసింది. లేకపోతే మోషే ప్రాణాలు పోయి ఉండేవి. మోషేపైనుండి దేవుని చెయ్యి తీయాలి అంటే, సున్నతి చేయాలి అన్న స్పృహ వారిలో ఉందంటే, విషయంలో  వారు ఎంత నిర్లక్షులై యున్నారో అర్ధం అవుతుంది. నిబంధన గైకొనక పోవడం వలననే ఇది జరిగింది అని గ్రహించారు, మరలా నిర్లక్ష్యం వహించకుండా ఉండేట్లు దేవుడు మరణానుభవము వరకు మోషేను తీసుకెళ్లాడు.            

GLP Rajesh Babu,
8520005888, 
satyavakyapunithyavelugu@gmail.com.

   

Comments

Popular posts from this blog

Nobody Understands Me

English version Nobody understands me      Do you feel that Nobody Understands you?, Nobody counts/cares your words?, Do people misunderstand instead of understanding you? Do you worry that nobody cares about you? Are you overflowing with unspeakable worries? anguish, and so on? Do you lose comfort and favor from family, relatives, friends, neighbors? However this is for you.      We don't have to blame others for these things, but we are the ones who need to understand ourselves for what we are. If we cannot understand ourselves, how can we make others understand us? We don't need to worry about anyone, and we don't have to blame anyone for not understanding ourselves.        All human beings, in general, want to others understand themselves. The husband and wife should understand themselves, the husband expects wife should understand him,the wife expects husband should understand her, the children expects parents should under...

Faithful fellowship for spiritual development

GLP Rajesh Babu English Version Fellowship with believers      Companionship means a healthy, friendly relationship with others. All true Christians on this earth should have fellowship with one another and have a divine relationship to be called believers. Our great faith in the Lord Jesus Christ makes us in perfect fellowship with the Father and other believers. No matter how many churches on earth, all of us who have accepted Christ as Savior are one family. So there must be divine and spiritu al companionship between us. Jesus said in John 13: 34-35 , I command you a new commandment, that you love one another; Just as I love you, you must love one another.      If you love one another, you will know that all of you are my disciples. Jesus Christ has set us up as a blood and blood community in order to have peace with one another, to have love, and to encourage. While Christ is the head, the church is his body on earth. So let's be a go...